అంబేద్కర్ సెంటర్ దారి బురదమయం

అంబేద్కర్ సెంటర్ దారి బురదమయం

అంబేద్కర్ సెంటర్ దారి బురదమయం

– జారి పడుతున్న వాహన దారులు

వెంకటాపురం నూగూరు,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రం వెంకటాపురంలోని అంబేద్కర్ సెంటర్ దారి బురదమయంగా మారి వాహన దారులు జారి పడుతున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ భవన శంకుస్థాపనకై  అంబేద్కర్ సెంటర్ రోడ్ గుండా మంత్రి కాన్వాయ్ ప్రయాణించవలసి ఉంది. అందులో భాగంగా అధికారులు నిత్యం రద్దీగా ఉండే అంబేద్కర్ సెంటర్ కూరగాయల దుకాణం ముందు  మెటల్ రోడ్డుపై మట్టితో గోతులు పూడ్చారు. రేగడి మట్టి కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రద్దీగా ఉండే అంబేద్కర్ సెంటర్ బురద మయంగా మారింది. నిత్యం వేలాదిమంది ప్రజలు, వాహనాలు, కార్లు, ఆటోలు ఇతర వాహనాలతో పాటు ఆరుకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఈ బురదనుండే వెళ్లాల్సి ఉంటుంది. ఇంత రద్దీగా ఉండే కూరగాయల దుకాణం ముందు నుండి రేగడి జిగురు మట్టి పోయడంతో పలువురు వాహన దారులు వర్షాల కారణంగా వాహనాల టైర్లు స్లిప్పై జారిపడి గాయాల పాలవుతున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో బురద, టైర్లు చిమ్మి పలువురు దుస్తులపై పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి అంబేద్కర్ సెంటర్లోని మెటల్ రోడ్డుపై బురద లేకుండా  గ్రావెల్, ఇసుక చల్లించి అసౌకర్యాన్ని తొలగించాలని వెంకటాపురం మేజర్ పంచాయతీ అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment