ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని ఆర్ టి జూనియర్ కళాశాల 2002-04 సంవత్సరానికి సంబంధించిన సీఇసి విద్యార్థులు 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ములుగు లోని మహర్షి కళాశాల ఆవరణలో కళాశాల కరస్పాండెంట్ తుమ్మ పిచ్చిరెడ్డి అధ్యక్షతన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఎంతో సంతోషంతో తమ గత అనుభవాలను స్నేహితులు,గురువులతో పంచుకున్నారు. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా స్నేహితులతో పంచుకొని చెప్పుకున్నప్పుడే భారం తగ్గుతుందని. విలువలతో కూడిన స్నేహం చాలా ముఖ్యం అని పిచ్చి రెడ్డి సూచించారు. విద్యతోపాటు సంస్కారంతో కూడిన చదువు చాలా ముఖ్యమని, సరస్వతీ దేవి ఉన్న చోటనే లక్ష్మీదేవి ఉంటుందని సూచించారు. విద్యార్థులందరూ ఆటపాటలతో తమ పూర్వ జ్ఞాపకాలను పంచుకున్నారు. గురువులందరిని సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు టి. సుధాకర్, డీ.జాకబ్, రవి శాస్త్రి, మనోహర్, మరియు విద్యార్థులు శ్రీనివాస్, రాజు, మమత, జ్యోతి, సంతోష్, రాజు, భవాని,రాము లావణ్య,సంపూర్ణ మొదలైన వారు పాల్గొన్నారు.