పూర్వ విద్యార్థుల ఔదార్యం
పూర్వ విద్యార్థుల ఔదార్యం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శాంతి ఖని ప్రాథమిక పాఠశాలలో 1988 89 సంవత్సరంలో ఏడవ తరగతి చదువుకున్న బ్యాచ్ వారి తోటి మిత్రుడు కీర్తిశేషులు పోటు సమ్మి రెడ్డి అకాల మరణం చెందాడు. ఏడవ తరగతికి చెందిన తోటి మిత్రులు అందరూ కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మల్లపల్లి కి చెందిన పోటు సమ్మి రెడ్డి కుటుం బానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ 18 వేల రూ. ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ మా బ్యాచ్ లో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహా యం చేయడంలో మేమందరము ముందు ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1988- 89 బ్యాచ్ చెందిన సెక్రెటరీ ఏదుల శ్రీనివాస్, అధ్యక్షులు బియ్యాల ఉపేందర్, ఆదిరెడ్డి, బీడీ రాజు, గాదే సత్యం, పానుగంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.