మల్లంపల్లిలో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
మల్లంపల్లి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2005-2006 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలుసుకొని ఒక రికొకరు ఆత్మీయంగా పలకరించుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఒకరికొకరం అండగా ఉండాలని తీర్మానం చేసుకున్నారు. అనంతరం పిల్లా పాపలతో కలిసి పాఠశాల ఆవరణలో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు స్వరూపరాణి, శేషగిరి, సుదర్శన చారి, వెంకటాచలం, నవీన్ తో పాటు పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.