ఆలుబాక భోదాపురం గ్రామస్తుల ఔదార్యం.

ఆలుబాక భోదాపురం గ్రామస్తుల ఔదార్యం.

– డెడ్ బాడీ భద్రపరిచే ఫ్రీజర్ ఏర్పాటు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో డెడ్ బాడీ భద్రపరిచే ఫ్రీజర్ లేక ఈ ప్రాంత ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారు అనేక ఇబ్బందులు పాటుపడుతున్నారు. ఎవరైనా స్వర్గస్తులయితే దూర ప్రాంతాన్నించి వచ్చే బంధువుల కడసారి చూపులకు కొన్ని గంటలపాటు ఎయిర్ కండిషన్ ఫ్రీజర్ లో, డెడ్ బాడీని ఉంచి కడసారి చూపులు అనంతరం అంత్యక్రియలు జరుపుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దూర ప్రాంతాల నుండి ఫ్రీజర్ ను కొంతమంది తెప్పించుకొని స్వర్గస్తులైన వారిని, కడసారి చూపులకు అందుబాటులో తెచ్చేవారు. ఈ సమస్యలను అధిగమించేం దుకు టిఆర్ఎస్ వెంకటాపురం మండలం అధ్యక్షులు గంపా రాంబాబు ఆధ్వర్యంలో ఆలుబాక, భోదాపురం దాతలు ముందుకు వచ్చి సుమారు 80 వేల రూపాయలు విరాళాలు సేకరించారు. అలాగే ఫ్రీజర్ను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా షెడ్డు నిర్మాణం కూడ జరిపారు .ఏ.సీ .ఫ్రీజర్ కొనుగోలు, షెడ్డు నిర్మాణం కొరకు సుమారు లక్ష 50 వేల రూపాయల వరకు వ్యయం ఆయినట్టు ఫ్రీజర్ దాతలు తెలిపారు. ఎవరికైనా ఫ్రీజర్ అవసరం అయినప్పుడు సెల్ ఫోన్ నెంబర్లతో , సోషల్ మీడియాలో సమాచారం విడుదల చేశారు. తోరం ఏసుబాబు 9502268016,అడబాల నాగేంద్ర 9347399177, చెరుకూరి సుబ్రమణ్యం 8106251570 అనే నెంబర్లకు ఫ్రీజర్ అవసర మైన వారు ఫోన్ చేయగలరని కోరారు. వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో కొన్ని సంవత్సరాల క్రితం మే ఫ్రీజర్ మరమ్మతులు గురై మూలన పడి ఉన్నది. వెంకటాపురం, వాజేడు మండలా లకు ఏసీ ఫ్రీజర్ అందుబాటులోకి రావడంతో ఆలుబాక, భోదాపురం ఫ్రీజర్ కొనుగోలు దాతలకు పలువురు అభినందనలు తెలిపారు.