ఆరోపణ చేయడం కాదు రుజువు చేయాలి
ఆరోపణ చేయడం కాదు రుజువు చేయాలి
– యూత్ కాంగ్రెస్ అక్షుడు బానోతు రవిచందర్
ములుగు : తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ కావాలని లేనిపోని మాటలు ప్రచారం చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్ తెలిపారు. ఆదివారం ములుగులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్క పేరు చెప్పి ఎవరికీ ఉద్యోగాలు ఇస్తానని మాట ఇవ్వలేదని, తమ గ్రామం జీవంతరావుపల్లి అభివృద్ధి కోసం మాత్రమే తాను నిరంతరం కృషి చేశానని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, ఆ తరువాత భూమి విషయంలో నలుగురు చెప్పిన తీరుగా వింటానన్నారు. ఉద్యోగాల పేరుతో ఎవరి వద్ద కూడా డబ్బులు వసూలు చేయలేదన్నారు. కొందరు కావాలని రాజకీయ కుట్రలో భాగంగా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రవించదర్ అన్నారు.