టిఆర్ఎస్ ఇంచార్జ్ పుట్ట మధుపై ఆరోపణలు అర్థరహితం

టిఆర్ఎస్ ఇంచార్జ్ పుట్ట మధుపై ఆరోపణలు అర్థరహితం

టిఆర్ఎస్ ఇంచార్జ్ పుట్ట మధుపై ఆరోపణలు అర్థరహితం

కాటారం, తెలంగాణ జ్యోతి : పెద్దపల్లి దళిత యువ ఎంపీకి గడ్డం వంశి కీ అవమానం జరిగితే దళితులుగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను నిలదీయాల్సింది పోయి పుట్ట మధు ను కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరం గా ఉందని కాటరం టిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రామిళ్ళ కిరణ్ అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తికి ఈ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానాలకు గురి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులకు కనీసం ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు అని అడిగే స్వాతంత్రం లేదంటే ఈ నియోజకవర్గంలో రాజ్యాంగం ఎంత వర్ధిల్లుతుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. పుట్ట మధు మీద కుట్రపూరితంగా ఎన్ని ఆరోపణలు చేసినా అవి ఆరోపణలగానే మిగిలిపోయాయి తప్ప ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ప్రజలను నమ్మించి పుట్ట మధు మీద అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురించి మీకెందుకు అని అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి ఉందా మంథని నియోజకవర్గంలో భారత రాజ్యాంగం ఖూనీ అవుతుంటే చూడలేక బి ఆర్ఎస్ పార్టీ పక్షాన దళిత ఎంపీకి మద్దతుగా మాట్లాడితే హర్షించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారంటే మీ బానిసత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మేము ఒకటే చెప్పుతున్నాం మా నాయకుడు పుట్ట మధు ఈ నియోజకవర్గంలో బహుజనులు అవమానపడితే పార్టీలు చూడరు వాళ్లకోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా శ్రీధర్ బాబు స్వతంత్రం అనేది ఇస్తే భారత రాజ్యాంగం ని గౌరవిస్తే ఎంపీ గడ్డం వంశీకృష్ణ ను ఈ నియోజకవర్గంలో గౌరవించాలని చెప్పండి అంతేగాని హక్కుల కోసం మాట్లాడే పుట్ట మధు లాంటి వాళ్లపై విమర్శలు చేస్తే ఈ సమాజం హర్షించదు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో శ్రీధర్ బాబు కు 31380 వేల ఓట్లు మెజారిటీ వస్తే గడ్డం వంశీకృష్ణకు 55 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. అంటే ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో శ్రీధర్ బాబు కన్నా గడ్డం వంశీకృష్ణ కే ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఇది అర్థం చేసుకొని మెలగాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment