ఎండ తీవ్రత అధికత పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి
– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ఉగ్ర రూపాన్ని చూపుతుండడంతో కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలని మంత్రి సీతక్క కోరారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ప్రజలంతా మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పెరగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్న పిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు పాటించాలని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని, ఆవసరమైతెనే ఇండ్ల నుంచి బయటకు రావాలని మంత్రి సూచించారు.