మాదిగల మద్దతంతా  కాంగ్రెస్ వైపే

మాదిగల మద్దతంతా  కాంగ్రెస్ వైపే

మాదిగ జాతి ద్రోహులు మాత్రమే బీజేపీ బి ఆర్ ఎస్ వైపు 

– వర్గీకరణ కాంగ్రెస్ తోనే సాధ్యం : లేతకరి రాజాబాబు

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : పది సంవత్సరాలు వర్గీకరణ కి తూట్లు పొడిచిన బి అర్ ఎస్, బీజేపీ ల దొంగ నాటకాలకు ఓటు తో సమాధానం చెప్పాలని, మాదిగ జాతి బిడ్డలకు ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి వర్గీకరణ చేస్తాం అని చెప్పుడు ఎన్నికలు అయ్యాక మోసం చేసుడు రెండు పార్టీలకు అలవాటుగా మారిందని ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు లేతకరి రాజాబాబు అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు వర్గీకరణ చేయలేదు. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ లో సభ పెట్టీ వర్గీకరణ కి మtద్దతు తెలిపారు కమిటీ వేస్తాం అన్నారు ఆ తర్వాత ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు కమిటీ కూడా వేయలేదు ప్రధాన మంత్రి వర్గీకరణ పై మాట తప్పితే ఇంతకన్నా గోరం ఏమైనా ఉంటుందా బీజేపీ బి అర్ ఎస్ ను మాదిగ జాతి బిడ్డలు నమ్మరు మరొక్కసారి విల్ల చేతిలో మోసపోడానికి మాదిగలు సిద్దంగా లేరు కొంతమంది చిల్లర విమర్శలు ఎన్ని చేసిన మాదిగలు అంత కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు ఉంటారు. పది సంవత్సరాలు బి అర్ ఎస్ పాలన లో కనీసం మాదిగ బిడ్డలు ఎంతో మంది ఎంఎల్ఏ లుగా ఉన్న కనీసం ఒక్కరికీ కూడా మంత్రిపదవి ఇవ్వక మాదిగ ఎంఎల్ఏ లను పది సంవత్సరాలు బానిసలుగా చూసిన బి అర్ ఎస్ ను ఎలా నమ్ముతారు మాదిగ సమాజం అధికారం లోకి వచ్చిన వెంటనే మాదిగ వర్గానికి చెందిన దామోదర రాజనరసింహకు ఆరోగ్య శాఖ మంత్రిని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి నీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ,రెండు పార్టీలు ఐనా బి అర్ ఎస్, బీజేపీ తోడు దొంగలు అని అన్నారు అధికారం ఉన్నపుడు మాదిగ లను పట్టించుకోని బి అర్ ఎస్ నాయకులు అధికారం పోగానే మాదిగలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు ఎన్ని డ్రామాలు చేసిన పొర్లు దండాలు పెట్టిన మాదిగలు మిమ్మూల నమ్మరు తప్పకుండా రాబోయే ఎన్నికలో పెద్ద పల్లి పార్లమెంట్ అభ్యర్ధి గడ్డం వంశిక్రిష్ణ గెలుపు ఖాయం ఐనది కాబట్టే ప్రత్యర్ధులకు నిద్రపడ్డటం లేదు అని అందుకే మాదిగ లను రెచ్చగొడుతున్నారు అని అన్నారు. మాదిగ సమాజం అంత జై కోడ్తున్నారు కాంగ్రెస్ పార్టీకి మరొక్క సారి కాంగ్రెస్ పార్టీ నీ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం అని మాదిగ లు స్వచ్ఛందoగా ముందుకి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర వహించిన ఇదే జాతి పార్లమెంట్ ఎన్నికలో సత్తా చాటుతారని ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు లేతకరి రాజాబాబు అన్నారు. ఈ కార్యక్రమములో అన్నారం ఎంపిటిసి దుర్గయ్య మండల ఎస్ సి సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ శంకర్ మద్దుల పల్లి మాజీ సర్పంచ్ సురేందర్ పాల్గొన్నారు.