అఖిల భారత యాదవ మహా సభ గంగారాం గ్రామ కమిటి ఎన్నిక
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం డివిజన్ యాదవ సంఘం అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కాటారం మండల గంగారం గ్రామ యాదవ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు గా జిల్లాల ఒదన్న యాదవ్, అధ్యక్షుడు గా బండి రాజేందర్ యాదవ్, ఉపాధ్య క్షుడు గా జిల్లాల దేవేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గా కట్టేకొల్ల శ్రీశేలం యాదవ్, కోశాధికారిగా ఏటేల్లి ఐలయ్య యాదవ్, సహాయ కార్యదర్శి గా మూడేత్తుల గౌరయ్య యాద వ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజ న్ అడ్ హక్ కమిటీ సభ్యులు గడ్డం చంద్రయ్య యాదవ్, అబ్బినవేని ఐలయ్య యాదవ్, గడవేని దేవేందర్ యాదవ్, ఆత్మకూరు కుమార్ యాదవ్, తొట్ల శ్రీశైలం యాదవ్ లు పాల్గొన్నారు.