సరస్వతీ పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
– పుష్కర సమాచారం తెలిపేలా ప్రత్యేక యాప్.
– పనులపై నివేదిక రెండు రోజుల్లో అందించాలి.
– ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్
– పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : సరస్వతీ పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని పుష్కర సమాచారం తెలిపేలా ప్రత్యేక యాప్ తయారు చేయాలని, చేపట్టే పనులపై అంచనా, వ్యత్యాసాల నివేదిక రెండు రోజుల్లో అందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంలో మే 15 నుండి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితర అధికారులు గురువారం ఈఓ కార్యాలయంలో సమీక్షించారు. పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించారు. సరస్వతి విగ్రహం ఏర్పాటుకు స్థలం నిర్ణయించడం, విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు రహదారి నిర్మాణం, పురుషులు, మహిళల కోసం శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.గోదావరి హారతికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు., విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశిం చారు.సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. పూర్తిచేయాల్సిన శాశ్వత, తాత్కాలిక పనులకు ముందుగానే షెడ్యూల్ తయారు చేసుకోవాలని, సిబ్బందిని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి పనుల్లో వేగం పెంచా లని సూచించారు. విస్తృత ప్రచారానికి అంబాసిడర్ ను నియమించాలని సూచించారు పుష్కర 12 రోజుల కార్యక్రమా లకు సంబంధించి షెడ్యూల్ తయారు చేయాలని ఈఓను ఆదేశించారు. వేడి దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం గోదావరిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరిలో నీని నిల్వలను పరిశీలించాలని తెలిపారు. సత్రం పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రముఖ ప్రాంతాలలో ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. గోదావరిలోకి భక్తులు వెళ్ళకుండా ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అంతకు ముందు విఐపి ఘాట్, గోదావరి ఘాటు వద్ద చేపట్టనున్న పనులను, సత్రం పనులను పరిశీలించారు. తదుపరి ఈఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజినీరింగ్ శాఖల ద్వారా చేపట్టనున్న పనుల ప్రగతిని వివరిం చారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, ఎస్పీ కిరణ్ ఖరే, దేవస్థానం ఆర్జేసీ రామకృష్ణారావు, పంచాయతిరాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, దేవస్థానం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
విలేకరులు కావలెను. వివరాలకు 9848552224 నంబర్లో సంప్రదించగలరు.
—————————————–