అలరారిన తెలుగు భాషా దినోత్సవం

Written by telangana jyothi

Published on:

అలరారిన తెలుగు భాషా దినోత్సవం

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేజిబివి పాఠశాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.గిడుగు రామమూర్తి పంతులు, ధ్యాన్ చంద్ చిత్ర పటాలకి ప్రిన్సిపాల్ చల్ల సునీత పూలమాలలతో అలంకరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా చల్ల సునీత రచించిన తెలుగు దినోత్సవం, క్రీడా దినోత్సవం గూర్చిన 5 పాటలను, పద్యాలను విద్యార్థినీలు ఆలపించారు. నృత్యాలు ఉపన్యాసాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు ఉపాధ్యాయురాలు కవిత, పి.ఇ.టి పాటలు పాడీ, కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించారు. కూరగాయలతో తెలుగు భాషా దినోత్సవం, క్రీడా దినోత్సవం అని అందంగా అలంకరించారు. ఆట వస్తువులను మధ్యలో పెట్టి విద్యార్థినీలు చుట్టూ చేరి ఆటలకు సంబంధించిన ఉయ్యాల పాటలు పాడి మంత్ర ముగ్ధులను చేశారు.ఇతర భాషా పదాలు వాడకుండా అందరూ అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడటం ప్రత్యేకతను సంతరించుకుంది . తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపాల్ చల్ల సునీత ప్రసంగిస్తూ, విద్యార్థులకు తెలుగు భాషా గొప్ప తనాన్ని, క్రీడల ఆవశ్యకత గురించి తన అమూల్య సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషోపా ధ్యాయురాల్లు కవిత, సరిత వ్యాయామ ఉపాధ్యాయిని రాజేశ్వరి , అరుణ, విజయ , శ్రీలత, నళిని, రాజమణి, లక్ష్మి స్వప్న, మణిమాల, శిరీష, సుజాత, ఏఎన్ఎమ్ లక్ష్మి , క్రాఫ్ట్ టీచర్ లక్ష్మి, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a comment