ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రత్యేకత

ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రత్యేకత
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండల కేంద్రంలోని అతిచిన్న గల గ్రామం ఐలాపూర్. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది.మండల కేంద్రానికి15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దట్టమైన ఈ కారణ్యంలోనే సమ్మక్క తల్లి దేవత ఆనవాళ్లు నేటికీ సజీవంగానే ఉన్నాయి. మేడారం మహా జాతర అయితే ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఐలాపూర్ అటవీ ప్రాంతంలో సమ్మక్క తల్లి దేవత జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా ఇక్కడున్న గిరిజనులు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంతంలోనే సమ్మక్క తల్లి ఆడుకోవడం, పులితో సంచరించడం లాంటి చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయని ఇక్కడ ఉన్న గిరిజనుల నమ్మకం.
సమ్మక్క తల్లి దేవత నేటికి ఆనవాళ్లు తెలియదు
మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలకు ఘనమైన చరిత్ర ఉంది. అనేకమంది అనేకసార్లు సమ్మక్క చరిత్రను చెప్పుకుంటారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలపై అనేక జానపద గేయాలు సినీ గేయాలు నేటికి అనేక వచ్చాయి.కానీ ఇప్పటికీ సమ్మక్క వనదేవత చరిత్రకు సంబంధించిన సజీవ ఆనవాళ్లు నేటికి అలానే ఉన్నాయి. సమ్మక్క తల్లి ఎక్కడ జన్మిచింది…?మరి ఆనవాలు ఎక్కడ ఉన్నాయి…? జన్మించిన ప్రాంతాన్ని వదలి సమ్మక్క దేవత ఎక్కడికి వలస వెళ్లింది…? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఐలాపూర్ దట్టమైన అడవి ప్రాంతానికి వెళ్లా ల్సిందే….. మేడారం మినీ జాతర సమయంలోనే ఐలాపూర్ జాతర మొదలవుతుంది. ఈ జాతరకు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారని ఐలాపూర్ దేవాలయ ప్రధాన పూజారులు,గ్రామస్థులు వెల్లడించారు.
ఐలాపూర్ లో కంటైనర్ ఆసుపత్రి
ముఖ్యంగా ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరకు మెరుగైన వైద్యం కొరకు రాష్ట్రమంత్రి సితక్క చొరవతో 8 లక్షల 50 వేల రూపాయలతో కంటైనర్ పర్మినెంట్ గా ఆసుపత్రిని నిర్మించారు.దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐలాపూర్ జాతరలో ప్రధాన ఘట్టాలు
ఫిబ్రవరి 12 తారకు బుధవారం రోజున సర్వాయి గ్రామం నుండి సారలమ్మ దేవతను పూజారులు గద్దె వద్దకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 13 తారీకు గురువారం రోజున కొండాయి గుట్ట నుండి సమ్మక్క దేవతను గద్దె వద్దకు తీసుకవస్తారు. ఫిబ్రవరి 14 తారీకు శుక్రవారం రోజున సమ్మక్క, సారలమ్మ దేవతలకు భక్తులు మొక్కలు చెల్లిస్తారు. ఫిబ్రవరి 15వ తారీకు శనివారం రోజున సమ్మక్క సారలమ్మ దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు.
పూజారులు, తలపతులు మల్లెల వంశస్థులు
ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఐలాపూర్ జాతరకు మల్లెల వంశస్థులు ఐదోవ గట్టు వారు పూజారులుగా వ్యవహిరిస్తున్నారు.కురుసం వంశస్థులు మూడోవ గట్టు వారు వడ్డేలుగా ఉంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నుండి ఎన్నో దశాబ్దాల క్రితం నుంచి ఈ జాతర గిరిజనులు నిర్వహిస్తున్నప్పటికి ప్రభుత్వం నుంచి అరా కోరగానే ఉండేది. కానీ ఇప్పుడు జరిగే మహా జాతరకు మంత్రి సితక్క చొరవతో ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ఐటిడిఓ పీవో మిశ్రా ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్వహణకు సంబంధించిన నిధులు కేటాయించడం భక్తుల కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. వీరి ఇద్దరు అధికారుల ప్రత్యేకత ఐలాపూర్ గ్రామంలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని పూజారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యూత్ అధ్యక్షులు సురేష్ వివరణ : ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ వన దేవతల జాతరకు మంత్రి దనసరి సితక్క చొరవతో ఈ సారి జాతరకు వచ్చే భక్తలకు అన్ని విధాలుగా వసతులు కల్పించామని యూత్ అధ్యక్షులు సురేష్ అన్నారు.జిల్లా కలెక్టర్, పీవో ను ఈ జాతరకు సానుకూలంగా స్పందించినందుకు మా గ్రామస్థులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.