యుక్త వయస్సులో యువత మానసిక ఆరోగ్యంతో వుండాలి
– జిల్లా మానసిక వైద్య నిపుణురాలు డా: నమ్రత దేవులపల్లి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ఇంటర్మీడి యట్ చదివే విద్యార్థులు అంతా యుక్త వయసులో తమ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఎటువంటి ఒత్తిడి లకు, దురలవాట్లకు లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ములుగు జిల్లా మానసిక వైద్య నిపుణురాలు డా. నమ్రత దేవులపల్లి అన్నారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో, ఆమె పాల్గొని కళాశాల విద్యార్థులకు మానసికంగా కలిగే అనేక కారకాల రుగ్మతల గురించి సూచనలు సలహాలు అంద జేశారు. ప్రతినెల నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థు లంతా పాల్గొని రుగ్మతలకు దూరం కావాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపన్యాసకులు డా. అమ్మిన శ్రీనివాస రాజు, దూమాల నరసింగరావు, బి. రమేష్, కె.రాంబాబు, కె. స్వర్ణలత, రోహిత, పి. ప్రేమ్ కుమార్, విద్యార్ధి ని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.