దోషులను శిక్షించాలని ప్లకార్డ్స్ తో నిరసన తెలిపిన ఆదివాసీలు

Written by telangana jyothi

Published on:

దోషులను శిక్షించాలని ప్లకార్డ్స్ తో నిరసన తెలిపిన ఆదివాసీలు

– చెంచు మహిళ పైన జరిగిన పాశవిక దాడిని ఖండించిన ఇప్పగూడెం ఆదివాసీలు

– ఆదివాసీ మహిళ పైన జరిగిన దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలి

తెలంగాణజ్యోతి, వాజేడు : దేశంలో ఆదివాసీల పైన దాడు లు నిత్యం కృత్యం అవుతున్నాయని ఆదివాసీ నవనిర్మాణ సేన మండల అధ్యక్షులు మొడెం నాగరాజు ఆరోపించారు. మంగళవారం వాజేడు మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ఆదివాసీలు ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ తో నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం, మొలచింతల గ్రామం లోని చెంచు మహిళ ఈశ్వరమ్మ పైన ఇటీవల అత్యంత పాశవిక ఘటన చోటు చేసుకుంది. ఈశ్వరమ్మ పైన జరిగిన దాడి యావత్తు ఆదివాసీ సమాజం పైన జరిగిన డాడీగా నాగరాజు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఆదివాసీల పైన అనేకం చోటు చేస్కుంటున్నా దోషుల పైన ఎటువంటి చర్యలు లేవన్నారు. ఈశ్వరమ్మ పైన జరిగిన దాడి అమానవీయమైనది అన్నారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దుస్థితి ఈ రాష్ట్రం లో దాపరించ్చిందని అన్నారు. పది రోజుల పాటు చెంచు మహి ళను అత్యంత పాశవికంగా హింసించారని అన్నారు. మార్మాంగాల్లో, కంట్లో కారం కొట్టి ఆమెను చిత్ర హింసలకు గురి చేసారన్నారు. పోలీషులు అసలైన దోషులను కొంతమంది ని వదిలేశారని తెలిపారు. జరిగింది ఆదివాసీ మహిళ పైన కాబట్టి ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. రాష్ట్రం లో ఆదివాసీలకు కనీస రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈశ్వరమ్మ పైన జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కోర్స. వెంకన్న, పర్షిక. సుజాత, పద్దం. పెంటమ్మ, కచ్చలపు. లక్ష్మి, యర్మ. జోగారావు, తాటి. పవన్,కారం.రాఘవి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment