జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో విజేతగా ఆదర్శ విద్యార్థులు
జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో విజేతగా ఆదర్శ విద్యార్థులు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జిల్లా స్థాయి యువ జన ఉత్సవాల్లో కాటారం మండలకేంద్రానికి చెందిన ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు గ్రూప్ ఫోక్ డ్యాన్స్ విభాగంలో విజేత లుగా నిలిచారు. యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో సోమ వారం జిల్లా కేంద్రంలోని సింగరేణి ఇండోర్ స్టేడియంలో నిర్వ హించిన యువజన ఉత్సవాల్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థా యి యువజన ఉత్సవాలకు ఎంపికయ్యారు. ఆదర్శ విద్యా ర్థులకు జిల్లా యువజన క్రీడల అభివ్రుద్ధి అధికారి జైపాల్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, పీడీలు రమేష్, రాజ య్య, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రెటరీ భద్రయ్య, ఏసీజీ రవీందర్ రెడ్డిలు సర్టిఫికెట్,బహుమతులను అందజేశారు.రాష్ట్రస్థాయికి ఎంపి కైన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు శిరీష, బీఏ రావు, సతీష్ లను ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషితలు అభినందించి సన్మానించారు.