అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

– వాజేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో తాసిల్దార్ కు ఫిర్యాదు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా వాజేడు మండలంలో అక్రమం గా గ్రావెల్ ను తరలించుకుపోతు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకొ వాలని వాజేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం వాజేడు మండల తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. సంబంధిత ఫిర్యాదు ప్రతులను మీడియాకు విడుదల చేశారు. రెవెన్యూ మైనింగ్ శాఖ నుండి సూచించిన సర్వే నంబర్లు కాకుండా, వేరే ప్రాంతం నుండి ప్రభుత్వ భూముల్లో వందలాది లారీలు,టిప్పర్లతో పూసూరు గోదావరి వంతెన మీదుగా  ఏటూరునాగారం మండలానికి తరలి స్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, మైనింగ్, ఇతర శాఖ అధికా రులకు ఫిర్యాదు చేసినట్లు అఖిలపక్ష నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయ కులు కే వి వి ఎస్ ఎన్ రాజు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పి. కృష్ణారెడ్డి, మండల సిపిఎం కార్యదర్శి కొప్పుల రఘుపతి, ఇంకా పలువురు నాయకులు, సంఘాలు పాల్గొన్నాయి.