కాళేశ్వరం మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలి.
కాళేశ్వరం మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలి.
– ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు ఇచ్చిన గ్రామ యువకుడు కోల మహేష్.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర గ్రామంలో ప్రభుత్వం అధికారికంగా రెండు మద్యం దుకాణాలను ఏర్పాటు కు అనుమతి ఇచ్చింది. అయితే మద్యం దుకాణాల టెండర్ దక్కిచ్చుకున్న యజమా నులు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహ రిస్తున్నారు. ఇక్కడి రెండు మద్యం దుకాణాల నుంచి అక్రమంగా మహారాష్ట్రకు మద్యాన్ని పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే మద్యం దుకాణాలో కొన్ని రకాల మద్యం కింగ్ ఫిషర్ బీర్లు, ఐబీ, ఓ సి,క్వటర్లు అందుబాటులో ఉంచకుండా ఆ మద్యాన్ని అంతా బెల్టు షాపులకు అధిక రేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణి లో వినూత్న రీతిలో కాళేశ్వరం గ్రామానికి చెందిన యువకుడు కోల మహేష్ దరఖాస్తు చేసి విన్నవించాడు. వెంటనే స్పంచించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎక్సైజ్ సుపరిండెంట్ కి విచారణకు ఆదేశించారు. మద్యం ప్రియులకు అందుబా టులో సరైన మద్యం అందుబాటులో లేకుంటే సంబంధిత షాప్ యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ శర్మకు కాళేశ్వరం గ్రామ యువకుడు కోల మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు.