మద్యం దుకాణాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
– జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో వినతి
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం డివిజన్ పరిధిలోని కాటారం, మహాదే వపూర్, పలిమేల, మహ ముత్తా రం, మలహర్ మండలా లలో గల మద్యం దుకాణాలు సిండికేట్ గా మారి అధిక ధరల కు విక్రయించడమే కాకుండా, బెల్ట్ షాపులకు మద్యం సరఫ రా చేస్తూ సామాన్యుల రక్త మాంసాలను పీల్చిపిప్పి చేస్తున్నా రని కాటారం మండలానికి చెందిన సామాజిక కార్యకర్త రామి ల్ల రాజబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ప్రజా వాణిలో ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. కాటారం మండల కేంద్రంలోని తెలంగాణ వైన్స్, శ్రీనివాస వైన్స్ పేరిట రెండు దుకాణాలను ఒకే చోట ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధం గా దుకాణ యజమానులు వ్యవహరిస్తున్నప్పటికి, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు. తెలంగాణ వైన్స్ రిటైల్ అమ్మకాలు కొనసాగిస్తుండగా, పక్కనే ఏర్పాటుచేసిన శ్రీనివాస వైన్స్ లో బెల్ట్ షాపులకు అమ్మకాలు కొనసాగిస్తూ, స్టిక్కరింగ్ వేసి బాహటంగానే ఆటోలలో అమ్మకాలు చేపట్టడం జరుగుతున్న చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. మండలం లోని మద్యం దుకాణాల నుంచి బెల్ట్ షాపులకు దర్జాగా అదనంగా 20 రూ. నుంచి 30 రూ. వరకు అమ్మకాలు కొనసా గించడం వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. తాజాగా కాలేశ్వరం మద్యం దుకాణాలలో కల్తీ జరిగి అపరిశుభ్రమైన బీర్లు అమ్మకాలు చేశారని బాధితులు అక్కడి దుకాణ యజమానులతో మొరపెట్టుకున్నప్పటికీ, సంబంధిత శాఖ అధికారులలో చలనం రాకపోవడం శోచనీ యమని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సత్వరమే స్పందించి మద్యం దుకాణాల అక్రమాలు అరికట్టాలని రామిల్ల రాజబాబు కోరారు. బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఆమ్యామ్యాలకు ఆశపడి అధికారులు చూసి చూడనట్టు ఉండటం వల్ల, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నాయని అన్నా రు. నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచాలని, సామా న్యులు దినసరి కూలీలు తాగే ఓసి, ఐబి బ్రాండ్ విస్కీలను అందుబాటులో ఉంచాలని రామిల్ల రాజబాబు జిల్లా కలెక్టర్ కు విన్నవించిన వినతి పత్రంలో కోరారు.