ఎర్రి గట్టమ్మ వద్ద యాక్సిడెంట్

ఎర్రి గట్టమ్మ వద్ద యాక్సిడెంట్
– అక్కడికక్కడే యువకుడి మృతి
ములుగు ప్రతినిధి : ములుగు జవహర్ నగర్ సమీపంలోని ఎర్రిగట్టమ్మ టెంపుల్ సమీపంలో మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందికొండూరు సతీష్ బాబు (33) అక్కడికక్కడే మృతి చెందాడు. గోవిందరావుపేట నుంచి ములుగుకు వస్తున్న కారు ములుగు నుంచి పస్రా వైపునకు వెళ్తున్న బైక్ ను వేగంగా ఢీకొనగా, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, కారు చాలా వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. అయితే కారు యజమాని పేరు పిట్టల వెంకటేశ్ అని తెలుస్తోంది.. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.