ఏ బీ వి పీ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాదేవపూర్ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను శుక్రవారం కాలేజీ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర కార్యదర్శి పేట సాయి మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా ఏబీవీపీ విద్యార్థుల కోసం విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తూ, వారి లో దేశభక్తి నింపుతూ జాతీయవాదులుగా తయారు చేస్తూ, సామాజిక సేవలు అందిస్తుందని అన్నారు. సిద్దిపేటలో జరిగే రాష్ట్ర మహాసభల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనికోరారు. ఈకార్యక్రమంలో సంజయ్ సాయికిరణ్, ప్రకాష్, వరుణ్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.