Aadhaar Update : ఆధార్ అప్డేట్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.
Aadhaar Update : ఆధార్ అప్డేట్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.
డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగదారుల అప్డేట్ కోసం మరో మూడు నెలలు గడువును (UIDAI) పెంచి మరో అవకాశం కల్పించింది. గతంలో ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియడంతో మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది (2024) సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే అవకాశమిచ్చినట్లయింది.
ఆధార్ కార్డ్‌లో అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలంటే..?
మొదటగా ఆధార్ అధికారిక వెబ్సైట్
https://myaadhaar.uidai.gov.in/ ని ఓపెన్ చేయండి
- ‘MyAadhaar’ మెనూ నుంచి ‘Update Your Aadhaar’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొండి.
- ఆపై ‘అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్లైన్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఆధార్ కార్డ్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ కోసం రీడిజైన్ చేయబడిన ఇంటర్ఫేస్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఆధార్ అప్డేట్ చేయడానికి ప్రొసీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
- మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను రిజిస్టర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేయండి
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి
- OTPని ఎంటర్ చేసిన తర్వాత మళ్లీ ‘అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా’ అప్షన్ పై క్లిక్ చేయండి.
- అడ్రస్ మార్చడానికి ‘అడ్రస్’ అప్షన్ పై క్లిక్ చేయండి.
- కొత్త అడ్రస్ సమాచారాన్ని ఎంటర్ చేయండి. వాటితో పాటు కొత్త అడ్రస్ వెరిఫికేషన్ ప్రూఫ్స్ అప్లోడ్ చేయండి.
- మీ కొత్త అడ్రస్ సమాచారాన్ని ఎంటర్ చేయండి, అవసరమైన డాక్యుమెంట్ ప్రూఫ్ స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయండి. అందించిన సమాచారం సరైనదేనని మళ్లీ కన్ఫర్మ్ చేయండి.
- సర్వీస్ కు సంబంధించిన ఏవైనా ఛార్జీలు ఏవైనా ఉంటే ఎంటర్ చేయండి.
- చివరగా ఇప్పుడు మీరందుకున్న URNతో స్టేటస్ చెక్ చేయవచ్చు