సమయపాలన పాటించని ఆధార్ నిర్వాకుడు..!
కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తహశీల్దార్ కార్యాలయం లో ఆధార్ అప్డేట్ చేసే నిర్వాకుడు సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాలకు వెళ్తే.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ఏటూరునాగారం మండలానికి లేదా మంగపేట మండలానికి ప్రజలు వెళ్లాల్సి వస్తోందని మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలోనే శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో ప్రక్కన ఉన్న మీసేవ నిర్వాకుడుని ఆధార్ అప్డేట్ కోసం తీసుకున్నారు. అటు ఆధార్ సెంటర్ ఇటు మీసేవలో వర్క్ ఒక్కరే చేయడంతో మండల తహశీల్దార్ ఆధార్ సెంటర్ కు సమయానికి రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆధార్ అప్డేట్ కోసం వస్తున్న ప్రజలకు సమయానికి ఉండక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు మండిపడుతున్నారు.