హైదరాబాద్ లో ఉరివేసుకొని ములుగు జిల్లా యువకుడి ఆత్మహత్య
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : హైదరాబాద్ లో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన సందీప్ (26) జీవనోపాధి కోసం కుటుంబ సమేతంగా హైదరా బాద్ కు వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.