పిడుగు పడి యువరైతు మృతి
తెలంగాణ జ్యోతి, ఏటూరు నాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామంలో పిడుగు పడి యువరైతు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి… వరి కళ్ళంలో వడ్లు తూర్పార పడుతుండగా ఒక్కసారిగా గాలిదుమారం వీచి పిడుగు పడి దుబ్బ ఉపెందర్ (25) అనే యువ రైతు అపస్మారక స్థితిలో పడిపోయాడు. అదేవిధంగా పండు రమేష్ అనే రైతు స్వల్పంగా గాయపడగా రైతులంతా హుటాహుటిన చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఉపెందర్ పరిస్థితి విషమించి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. రైతు మరణంతో ఎక్కెల గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.