అన్నం పెట్టడం లేదని అలిగి సెల్ టవర్ ఎక్కిన యువకుడు
అన్నం పెట్టడం లేదని అలిగి సెల్ టవర్ ఎక్కిన యువకుడు
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన శ్యామల రాజేష్ కు ఇంట్లో వాళ్ళు తనకు అన్నం పెట్టడం లేదని అలిగి ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన సంఘటన చోటుచేసుకుంది. శ్యామల రాజేశ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ఇంట్లో అన్నం పెట్టడం లేదని గొడవ పడి, పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిద్రపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు టవర్ వద్దకు చేరుకుని రాజేష్ ను కిందికి దింపి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.