సైకిలిస్ట్ ను ఢీకొట్టిన ఇసుక లారీ
సైకిలిస్ట్ ను ఢీకొట్టిన ఇసుక లారీ
– తృటిలో తప్పిన ప్రాణాపాయం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం చర్ల ప్రధాన రహదారిపై మండల పరిధి లోని వెంగళరావుపేట వద్ద మంగళవారం రాత్రి సైకిల్ పై వస్తున్న సాధన పెళ్లి నగేష్ అనే వ్యక్తిని ఇసుక లారీ కొట్టి ఢీ కొట్టింది. దీంతో సైకిల్ పై నుండి ఎగిరి రోడ్ కింద పడ్డ సాధన పల్లి నగేష్ తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసు కున్న వెంటనే గ్రామస్తులు హుటాహుటిన క్షతగాత్రున్ని వెంక టాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాద సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.