రహదారుల నిర్మాణానికై మంత్రి కి వినతి
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపా లపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గ పరిధిలో గల కాటారం మండలంలోని పలు గ్రామాలకు అనుసంధాన అంత ర్గత రహదారుల నిర్మాణానికై మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు కాటారం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొంపల్లి రాజేందర్ వినతి పత్రం అందజేశారు. రాజేందర్ బుధవారం హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. మం డలంలోని జగ్గయ్య పల్లె నుంచి రాంరెడ్డి బావి వరకు మెటల్ రోడ్డు నిర్మించాలని కోరారు. అలాగే జగ్గయ్యపల్లి చిన్న వాగు నుండి మాదారం జీలపల్లి అడ్డ రోడ్డు వరకు, బట్టికాడి మారయ్య సమాధి నుండి ములుగు పెళ్లి ఆర్ అండ్ బి రోడ్డు వరకు రోడ్లను మంజూరు చేయాలని రాజేందర్ మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రంలో పేర్కొన్నారు ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని రాజేందర్ విలేకరులకు తెలిపారు.