రెగ్యులర్ ఎంఈవోను నియమించాలి
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలానికి రెగ్యూల ర్ ఎంఈవోను నియమించాలని గుర్రెవుల అంబెడ్కర్ యువ జన సంఘం మాజీ అధ్యక్షుడు అంబాల ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యూలర్ ఎంఈవో లేక పోవటం వల్ల పాఠశాలలపై పర్యవేక్షిణ లోపించి విద్యా వ్యవస్థ కుంటు పడుతుందని,రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవ డంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సక్రమంగా లేక అందరు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని ఆరోపించారు. ఇప్ప టికైన అధికారులు మండలంలో రెగ్యూ లర్ ఎంఈవోను నియమించి పాఠశాలలపై పర్యవేక్షణ పెంచే లా చర్యలు తీసుకోవాలని కోరారు.