అడవిలో చిక్కుకున్న పోలీస్ కూంబింగ్ పార్టీ

Written by telangana jyothi

Published on:

అడవిలో చిక్కుకున్న పోలీస్ కూంబింగ్ పార్టీ

– హెలికాప్టర్ ద్వారా మండపాక కు తరలింపు

డెస్క్ : అడ‌విలో కూంబింగుకు వెళ్లి చిక్కుకున్న పోలీసు బలగాలను హెలికాప్టర్ ద్వారా  ములుగు జిల్లా వాజేడు మండలం మండపాకకు తరలించారు. గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన ఛ‌త్తీస్ ఘ‌డ్ అడవుల్లోకి కూంబింగ్ నిమిత్తం వెళ్లిన పోలీసు బలగాలు అడవిలోనే చిక్కిపోయారు. ఎలిమిడి ఎన్ కౌంటర్ లో పాల్గొని తిరుగు ప్రయాణం లో వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు, వంకలు ఉదృతంగా పొంగి ప్రవహించడంతో వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గుట్టల్లో చిక్కుకున్నట్టు సమాచారం. వారు నడవలేని స్థితిలో ఉండగా అది తెలుసుకున్న పోలీసు యంత్రాంగం హెలికాప్టర్ సహాయంతో వాజేడు మండలం మండపాక గ్రామానికి హుటాహుటిన తరలించి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిసింది…

Leave a comment