గడిగడ్డలో స్మశాన వాటిక కు స్థలం కెటాయించాలి
గడిగడ్డలో స్మశాన వాటిక కు స్థలం కెటాయించాలి
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని గడిగడ్డ, సుభాష్ నగర్, బెస్తవాడ, సఫాయి వాడలకు చెందిన ప్రజలకు స్మశాన వాటికకు స్ధలం కేటాయించాలని కలెక్టర్ దివాకర కు సోమవారం గ్రీవెన్స్ లో వినతిపత్రం అందచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా స్మశాన వాటిక లేక ఇక్కడి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్మశాన వాటికకు ప్రభుత్వం స్థలం లేకపోవడంతో బొందల గడ్డలలో ధహన సంస్కరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారికంగా స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ త్వరలోనే స్మశాన వాటికకు ప్రత్యేకమైన స్థలానికి కేటాయించి నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పోరిక గోవింద్ నాయక్, యాసం రవి, గాధం కుమార్, జంపాల రవీందర్, సామ్రాజ్యం, రాజు, సాంబయ్య, ఎల్లయ్య,రవి, రఘు, తదితరులు పాల్గొన్నారు.