రైతు రాజ్యమే లక్ష్యం

Written by telangana jyothi

Published on:

రైతు రాజ్యమే లక్ష్యం

– బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకట రమణ

కాటారం ప్రతినిధి,తెలంగాణ జ్యోతి: తెలంగాణలో రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ అన్నారు. తెలంగాణలో రైతును రాజు చేయడమే లక్ష్యం గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అత్యధికంగా వ్యవసాయరంగానికి నిధులు కేటాయించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోందని కితాబునిచ్చారు. గత పదేండ్లలో ఆగమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఈ బడ్జెట్ ఉపకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ అన్ని రంగాలకు, ఆరు గ్యారెంటీ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సముచిత స్థానం కల్పించిన ఈ బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, శాసన మండలి లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు కు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ఇప్పటికే బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులు అందించినట్లు వివరించారు.

Leave a comment