ఆరుగుంటపల్లిలో నూతనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

ఆరుగుంటపల్లిలో నూతనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

ఆరుగుంటపల్లిలో నూతనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

– వాజేడు మండల అఖిల పక్షం కమిటీ ఎంపీడీవోకు వినతి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ఆరుగుంటపల్లిలో నూతనంగా పోలింగ్ కేంద్రా న్ని ఏర్పాటు చేయాలని వాజేడు మండల అఖిలపక్షం కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అధికారులు త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలపై, పోలింగ్ కేంద్రాల అంశంపై వివిధ రాజకీయ పార్టీలు, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం అన్ని రాజకీయ పార్టీలు సంయుక్తంగా మండల అభివృద్ధి అధికారి విజయ కు పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్ఫులు, ఓటర్ల సౌకర్యం కొరకు వినతి పత్రాన్ని అందజేశారు. వాజేడు మండలం బొల్లారం గిరిజనులు మురుమూరు ఎంపీటీసీ సిగ్మెట్లో ఉన్నా రని, బొల్లారం ఆదివాసి గిరిజన ఓటర్లు సుమారు 8 కిలోమీటర్లు కాలినడకన వచ్చి, ప్రగళ్ళప ల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయవలసిన దుస్థితి నెలకొందన్నారు. అలాగే మురుమూరు ఎంపీటీసీ పరిధిలోని ఆరుగుంట పల్లిలో, బొల్లారం, ఆరుగుంటపల్లి గిరిజన ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. అలాగే కృష్ణాపురం ఎంపీటీసీ పరిధిలో ఉన్న పెద్ద గంగారం ఓటర్లు ఆగ్రామా లకు దగ్గరగా ఉన్న టేకులగూడెం పోలింగ్ కేంద్రానికి ఓటర్లును బదిలీ చేయాలని వినతి పత్రం లో కోరారు. ఏడు చర్లపల్లి ఎంపీటీసీ పరిధిలోని మండపాక ఓటర్లను దగ్గరగా ఉన్న పూసూరు పోలింగ్ కేంద్రాల్లో ఆయా ఓటర్లను బదిలీ చేసి ఓటు హక్కును వినియో గించుకునెలా దగ్గరలోని పోలింగ్ కేంద్రాల్లో ఆయా ఓటర్లను విలీనం చేయాలని వినతి పత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లె డెనార్జనరావు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. రఘుపతి బిజెపి, సిపిఐ, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజి ఎంపీటీసీలు సంయుక్తంగా వినతి పత్రం పై సంతకాలు చేసి అందించారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment