కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం: మండల కేంద్రంలో ఆదివారం కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా, మండల ఇంచార్జి జాడి రాంబాబు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల టీసీ పరిధి క్లస్టర్ల వారిగా క్లస్టర్లను నియమించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా, మండల ఇన్చార్జి జాడి రాంబాబులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ సైనికుల్లా పని చేయాలనీ సూచించారు. అదే విధంగా ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా పాలన అభివృద్ధి పనులను ప్రజల సంక్షేమ పథకాలను పల్లెల్లోకి తీసుకెళ్లి ప్రజలకు వివరిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు బోట నగేష్, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు ఎస్, రాంబాబు, మండల సీనియర్ నాయకులు చిట్యాల అరుణ్ కుమార్, పూజారి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సాగర్, కొయ్యల సమ్మయ్య, పగిడయ్య, కాంగ్రేస్ మండల పార్టీ నాయ కులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment