గుండాల అడవుల్లో భారీ ఎన్ కౌంటర్
– ఆరుగురు మావోయిస్టులు హతం
– జవాన్ కు గాయాలు
ములుగు ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అడ వుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.. తెలంగాణలో గత వైభవం కోసం మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి పోలీ సులు ఎదురు దెబ్బ కొట్టారు. ప్రత్యేకంగా దళాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగించాలనుకున్న ప్రయత్నంలో ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న దళం దాదాపు తుడిచి పెట్టుక పోయింది. సంఘటనా వివరాల్లోకి వెళ్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీలాద్రిపేట, గుండాల, కరకగూడెం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతం లో పోలీసు బలగాలకు మావోయిస్టు పార్టీ నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ హతమ య్యారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేష న్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టు పార్టీ మణుగురు ఏరియా లోకల్ గెరిల్లా స్క్వాడ్ కమిటీ తారసపడడంతో ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మణుగురు, కొత్తగూడెం ఏరియా లోకల్ గెరిల్లా స్క్వాడ్ (LGS) కమాండర్, డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM) కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న(43) చనిపోయాడు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా రాయగూడెంకు చెందిన లచ్చన్నతో పాటు అతని భార్య, ఏరియా కమిటీ మెంబర్ (ACM), ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా పొంబాడ్ గ్రామానికి చెందిన పూనమ్ లక్కె అలియాస్ తులసి, సోడి బోమన్, సోడి కాసి, మరో ప్లాటూన్ సభ్యుడు ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా కుచెందిన కవ్వాసి రాము, చర్లకు చెందిన శుక్రంలు చనిపోయారు. వీరిలో ముగ్గురు ఏసీఎం క్యాడర్ లో ఉన్నారు. ఘటనా స్థలం నుంచి 2 AK-47లు, ఇతరాత్ర మావోయిస్టులకు సంబంధించిన వాటిని రికవరి చేశారు.
– జవాన్ కు గాయం
మావోయిస్టు పార్టీ దళంతో జరిగిన ఎదురు కాల్పుల్లో గ్రే హౌండ్స్ కు చెందిన ఓ జావాన్ కు కూడా తీవ్ర గాయల య్యాయి. అతన్ని భద్రాచలం తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు మరో ఆసుపత్రికి తరలిం చినట్టుగా తెలుస్తోంది. పారా మిలటరీ బలగాలు వెళ్ళిన తరువాత తాజాగా భద్రాద్రి జిల్లా కరకగూడెం ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో రాష్ట్ర గ్రే హౌండ్స్ బలగాలు పాల్గొ న్నాయి. చత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తెలం గాణ జిల్లాల్లో దశాబ్దాల కాలంగా సీఆర్పీఎఫ్ బలగాలు భద్ర తా చర్యల్లో పాల్గొనేవి. అయితే మావోయిస్టుల కార్య కలా పాలు సమిసి పోయాయన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం ఇక్క డ మోహరించిన సీఆర్పీఎఫ్ క్యాంపులను ఎత్తి వేసింది. ఈ నేఫథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ గ్రే హౌండ్స్, టీజీఎస్పీ, సివిల్ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టా యి. సీఆర్పీఎఫ్ క్యాంపులు తరలివెల్లిన తరువాత తెలంగా ణలో ఇదే తొలి ఎన్ కౌంటర్ కావడం గమనార్హం.