మిర్చి తోటలో కలుపు తీస్తుండగా పాము కాటుతో మృతి. 

మిర్చి తోటలో కలుపు తీస్తుండగా పాము కాటుతో మృతి. 

మిర్చి తోటలో కలుపు తీస్తుండగా పాము కాటుతో మృతి. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం తానిపర్తి గ్రామం కు చెందిన దుర్గం సోమేశ్వరరావు (38) శుక్రవారం గ్రామ సమీపంలోని మిర్చి తోటలో కలుపు తొలగిస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. క్షతగాత్రున్ని వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విష మంగా ఉండటంతో ములుగు ప్రభుత్వ వైద్యశాలకు తరలి స్తుండగా మృతి చెందారు. మిర్చి తోటలో బిందు సేద్యం మల్చింగ్ షీట్ కింద నక్కి ఉన్న పాము కలుపు తీస్తుండగా ఒక్కసారిగా బుస కొడుతూ చేతిపై కాటు వేసింది. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు కన్నీరు,మున్నీరుగా విలపిస్తుండగా వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. ఫిర్యాదు మేరకు వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment