163 జాతీయ రహదారిపై భారీ వృక్షం పడి ట్రాఫిక్ జాం…
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం : మండలం లోని చిన్నబోయినపల్లి వద్ద 163 జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షం కారణంగా భారీ వృక్షం విరిగిపడింది. దీంతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలతో పాటు అంబులెన్స్ సైతం ట్రాఫిక్ లో నిలిచిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు, స్థానిక గ్రామ ప్రజలు చెట్టును తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.