సేవాలాల్ జయంతికి సెలవు ప్రకటించాలి : గోర్ సేనా గోర్ సిక్వాడి
ములుగు ప్రతినిధి : ఫిబ్రవరి 15న జరిగే బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలని గోర్ సేనా గోర్ సిక్వాడి నాయకులు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఓ వినతిపత్రం అందజే శారు. సేవాలాల్ జయంతి రోజున సెలవు ప్రకటిస్తూ ప్రతి నియో జకవర్గానికి 5 లక్షల నిధులను విదుదల చేయాలని వినతి పత్రం లో సిఎంఓ కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి గోర్ సేనా నాయకులు పోరిక రాజ్ కుమార్ నాయక్, పోరిక రాహుల్ నాయక్, శ్రీరామ్ నాయక్, బాబు నాయక్, సారయ్య నాయక్, ప్రతాప్ నాయక్, రవివర్మ నాయక్, జితేందర్ నాయక్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.