వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం.
వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీ.ఆర్. కె పురం గ్రామపం చాయతీ పరిధిలోని, వాడ బలిజ కుల పెద్దలు,యువకులు గ్రామ కుల పెద్ద, వాడబలిజ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన డర్రా దామోదర్ ను, ఆదివారం గ్రామంలో ఘనంగా సన్మానిం చారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ,డర్ర దామోదర్ వి ఆర్ కె పురం గ్రామానికి చెందిన వారు. వాడ బలిజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎప్పటి కప్పుడు ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని, అలాగే వాడబలిజ కులస్తుల కష్టసుఖాల్లో పాలుపంచుకొని చేదోడు వాదోడుగా ఉంటూ, మనోధైర్యం కల్పించే డర్రా దామోదర్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికవ్వటం పట్ల విఆర్కే పురం గ్రామస్తులు హర్ష వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. గోదావరి తీర ప్రాంతంలో తాతలు ముత్తాతల కాలం నుండి వాడబలిజలు మత్స్యకారులుగా, మరియు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం బీ.సీ కులస్తులైన వాడ బలిజలకు వారి ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయటం లేదని ,రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు బీసీలైన వాడబలిజలను ఓట్ల బ్యాంకు గా మార్చుకుంటు న్నారని, వాడ బలిజలు అంతా సంఘటితంగా ఉండి, ప్రభుత్వ సంక్షేమాలు సాధించుకోవాలని ఈ సందర్భంగా అధ్యక్షుడు దామోదర్ పిలుపునిచ్చారు. అర్హులైన వాడబలిజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరించేందుకు, రాష్ట్ర అధ్యక్షులుగా, జిల్లా ,మండల కమిటీ నాయకులతో కార్యకర్తలతో కృషి చేయనున్నట్లు సన్మాన గ్రహీత రాష్ర అధ్యక్షులు దామోదర్ తెలిపారు. ఆయనను . పట్టు శాలువతో సత్కరించి , మిఠాయిలు పంపీణి చేశారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు వాదం నరసింహారావు, సనుగొండ వెంకన్న, కొప్పుల మల్లయ్య, పోతురాజు, రాము, నాగేశ్వరరావు, మల్లికార్జున్, రమేష్, ప్రశాంత్, నాగేంద్రబాబు, కళ్యాణ్, జయరాం, నరసింహారావు, వేణు, దినేష్, సూర్యం, శేఖర్, సారయ్య, నరేష్, రవిచంద్రమూర్తి, ప్రసాద్, వినోద్ తదితర కులసంఘ నాయకులు, పెద్దలు, యూత్ పాల్గొన్నారు.