ఘనంగా భవాని స్వాముల ఇరుముడుల కార్యక్రమం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం లోని శ్రీ నాగు లమ్మ పుట్ట వద్ద భవానీ స్వాముల పీఠం లో గురుస్వాములు భవాని మాల ధారణ స్వాములకు అత్యంత వైభవంగా జై భవాని జై జై భవాని జై జై కనకదుర్గమ్మ తల్లి అనే భక్తుల నినాదాలతో ఇరుముడుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో 41 రోజులు పాటు భవానీ మాత మాల ధారణ స్వాములు దీక్షలు నిర్వహించి, శుక్రవారం గురుస్వాముల ఆశీర్వాదంతో ఇరుముడులను ధరించి విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ తల్లి ఆలయానికి తరలి వెళ్లారు. వెంకటాపురం పట్టణ కేంద్రానికి చెందిన వారితో పాటు, వాజేడు మండలంకు చెందిన ఏడుచర్ల పల్లి కీ చెందిన శ్రీ భవాని మాల స్వాములు సుమారు 40 మందికి పైగా ఇరుముడుల కార్యక్రమంలో పాల్గొన్నారు. బంధువు లు, భక్తుల జై భవాని జై కనకదుర్గమ్మ తల్లి నినాదాలతో విజయవాడ కు ప్రత్యేక వాహనాలలో స్వాములు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాగులమ్మ పుట్ట వద్ద ఇరుముడుల కార్యక్రమం కు మాల ధారణ భక్తుల బంధువులు, భక్తులు ముఖ్య మహిళా భక్త సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై ఇరుముడుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాముల వారికి అమ్మవారి ఇష్టపూర్వకమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. భవానీ స్వాముల ఇరుముడుల కార్యక్రమం సందర్భంగా నాగలమ్మ పుట్ట వద్ద , పీఠం వద్ద భక్తుల రద్దీతో కిటకిటలాడింది.ఈ భక్తిరస ఇరుముడుల కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు కు చెందిన మాల ధారణ స్వాముల బంధువులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో, నాగులమ్మ పుట్ట వద్ద భక్తిరస సందడి నెలకొంది.
1 thought on “ఘనంగా భవాని స్వాముల ఇరుముడుల కార్యక్రమం. ”