ములుగులో ఘనంగా ధ్యానోత్సవం

ములుగులో ఘనంగా ధ్యానోత్సవం

ములుగులో ఘనంగా ధ్యానోత్సవం

– హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ రామచంద్ర మిషన్ యోగా

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ధ్యానోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, సెయింట్ ఆంతోనీ స్కూల్ కరెస్పాండెంట్ కందాల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఆధునిక యాంత్రిక ఉరుకుల పరుగుల జీవన విధానంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, ఆందోళను సులువుగా అధిగమించేందుకు ధ్యానం ఒక గొప్ప సువర్ణావకాశం అన్నారు. మానసిక ప్రశాంతత, వ్యక్తి నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ ద్యానోత్సవం లో హార్ట్ ఫుల్ నెస్ భూపాలపల్లి జిల్లా కోఆర్డినేటర్ ఒడ్నాల శ్రీనివాస్, మాధవి, పడమటి నరేష్, మాకుల సంతోష్, తిరుమలేష్, తిరుపతి రావు, ప్రమీల, సవేరా, లీల, సంగ రంజిత్ కుమార్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు రోజుల దినోత్సవం నేర్చు కోవడం ద్వారా ప్రజలకు ఒత్తిడిలేని ఆరోగ్యకర జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగ పడుతుందని ప్రజలు అన్నారు.