వైభవంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం
వైభవంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవంa
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కాటారం మండల కేంద్రం లోని ఆదర్శ హైస్కూల్ లో ఆదివారం రాత్రి నిర్వహించిన మహా పడిపూ జ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. పీచర రామకృష్ణ రావు 25వ పడి, జనగామ కార్తీక్ రావు 6వ పడిల ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ చక్ర వర్తుల పురుషోత్తమాచార్యులు గురుస్వామిచే పడిపూజ కనుల పండువగ సాగింది.ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూలతో మెట్లను అలంకరించి, అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూ జలు నిర్వహించారు. భక్తుల అయ్యప్ప నామస్మరణతో ప్రాంగణ మంత మారుమోగింది. కాలు బృందం, భక్తాంజనేయ భజన మండ లి ఆధ్వర్యంలో అయ్యప్ప భజనాలతో హోరెత్తింది.ఈ కార్యక్రమం లో పూజారులు నాగరాజు శర్మ, భాను ప్రసాద్ శర్మ, గురుస్వాము లు బచ్చు అశోక్ , చీమల రాజు, ప్రభాకర్ రెడ్డి, వెంకన్న, జక్కు మొగిలి, పసుల రామచంద్రం, వెంకటేశ్ గౌడ్ , సత్యనారాయణ, సంతోష్, శ్రీనివాస్, సంపత్ రావు, అశోక్, దీక్షపరులు , భక్తులు, మహిళ భక్తులు పాల్గోన్నారు.