అడవి ప్రాంతంలో వన్యప్రాణులకు ఉచ్చులు, కరెంట్ ట్రాప్స్ నివారణ పై సమన్వయ సమీక్ష

అడవి ప్రాంతంలో వన్యప్రాణులకు ఉచ్చులు, కరెంట్ ట్రాప్స్ నివారణ పై సమన్వయ సమీక్ష

– ఫారెస్ట్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ లతో కోఆర్డినేషన్ మీటింగ్ ను నిర్వహించిన కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి 

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా వన్య ప్రాణులకు ఉచ్చులు, కరెంటు ట్రాప్స్ అమరుస్తూ వన్య ప్రాణులను బలి తీసుకుంటున్న మాఫియా ను కచ్చితంగా నివారించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ , ఎలక్ట్రి సిటీ డిపార్ట్మెంట్ , పోలీస్ డిపార్ట్మెంట్ లతో కలసి సమన్వ యం తో చర్యలు చేపట్టాలని కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి కోరారు. అలాగే అందుకు గ్రామాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అదేవిధంగా వన్యప్రాణుల మాంసపు మాఫియాను గుర్తించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫారెస్ట్, పోలీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల యొక్క కలయికలో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దానిలో ఎప్పటికప్పుడు వన్యప్రాణులకు ఉచ్చు వేసే మాఫియాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వన్య ప్రాణుల వేటగాళ్లను గురించిన సమాచారాన్ని అందరు పంచుకుంటూ వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటూ మూగజీవాలను రక్షించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల సరిహద్దుల్లో గాని పంట పొలాలలో గాని ఉచ్చులు, కరెంట్ ట్రాప్స్ వేయడం వల్ల ఆవులు, గేదేలు వంటి పశువులు ఇతర జంతువులు మరియు రైతులు, రైతు కూలీలు కూడా ప్రమాదాల బారిన పడి మరణిస్తున్న నేపథ్యం లో వాటిని కచ్చితంగా నివారించాలని సూచించినారు. గ్రామాల వారీగా వన్యప్రాణుల వేటగాల్లను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ , బైండ్ ఓవర్ చేస్తూ అటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే జైలుకి పంపిస్తామని, పీ డీ ఆక్ట్ కూడా ప్రయోగించుతామని కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారికి హెచ్చరించాలని తెలియజేశారు. గ్రామాల వారీగా పోలీస్, ఫారెస్ట్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల సమన్వయంతో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్ లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వన్యప్రాణుల వేటగాళ్లను నివారిం చాలని సూచించినారు. ఈ కార్యక్రమంలో కాటారం డీ ఎస్ పీ గడ్డం రామ్మోహన్ రెడ్డి తో పాటు మహాదేవపూర్ సీ ఐ బీ .రాజేశ్వరరావు, కొయ్యూరు, కాటారం అటవీ శాఖ రెంజర్లు ఎన్ కిరణ్ కుమార్ , కాటారం ఎస్ ఐ లు ఎం అభినవ్, హరి శేఖర్, కొయ్యూరు ఎస్ ఐ నరేష్, అడవిముత్తారం ఎస్ ఐ మహేందర్ కుమార్, కాలేశ్వరం ఎస్ ఐ భవాని సేన్, పలిమేల ఎస్ ఐ తమాషా రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ కిరణ్ రాజు, కాటారం సబ్ డివిజన్ పరిధిలో పనిచేసే ఫారెస్ట్ డీ ఆర్ వోలు, ఎఫ్ ఎస్ ఓ లు, ఎఫ్ బీ ఓ లు, పాల్గొన్నారు. పలువురు వేలుబుచ్చిన సలహాలు సూచనలను నివేదించారు.