పాకాల సరస్సులో మళ్లీ మొదలైన బోటు షికారు
– ఆనందంలో పర్యాటకులు
– పర్యాటకులకు కనువిందు చేయనున్న బోటు షికారు
ఖానాపూర్, తెలంగాణ జ్యోతి : ఖానాపూర్ మండలంలో పాకాల సరస్సులో గత కొంత కాలంగ బోట్ షికారు ఆగి పోవడంతో పర్యాటకులు నిలిచిపోవడంతో పర్యాటకులు నిరాశ చెంది వెను తిరిగే పరిస్థితి దర్శనమిచ్చేది. ఇదే క్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే గా దొంతి మాధవరెడ్డి గెలుపొం దిన తర్వాత ఆయన చొరవ తీసుకొని ఫారెస్ట్ అధికారులతో చర్చించి బోటు షికారు కు చర్యలు చేపట్టారు. పాకాలను సందర్శించే పర్యాటకుల నిమిత్తం బోటు షికారును పునరుద్ధ రించినట్లు ఎఫ్ ఆర్ వో రవి కిరణ్ తెలిపారు. దీంతో పాకాల ను సందర్శించే పర్యాటకులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు, ఎమ్మెల్యే.దొంతి మాధవ రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.