జిల్లా ఆస్పత్రి సమస్యలపై 48 గంటల దీక్ష వాయిదా..
ములుగు, మే 24, తెలంగాణ జ్యోతి: భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా ఆధ్వర్యంలో ములుగు జిల్లా జనరల్ హాస్పిటల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన 48 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు బీజేపీ ములుగు అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం బస్సు యాత్రలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోవడంతో దీక్షను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. తదుపరి దీక్ష కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.









