కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత 

Written by telangana jyothi

Published on:

కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత 

– ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ

– సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

– మల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని పోలీసులకు ఆదేశం

– రీ పోస్ట్‌మార్టం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషనర్లు

– మృతదేహాలను మావోయిస్టుల కుటుంబ సభ్యులకు అభ్యంతరం లేకపోతే అప్పగించాలని ఆదేశం

– తదుపరి విచారణ ఈ నెల 5కు వాయిదా

      ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల మృత దేహాలను మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగిం చారు. ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రిలో పోలీసుల సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మార్చురీ గదిలోనే భద్రపరిచారు.మంగళవారం మృతి చెంది న మావోయిస్టు కుర్సం మంగు అలియాస్ భద్రు మృత దేహా న్ని పోస్టుమార్టం అనంతరం డీఎస్పీ ఎన్.రవీందర్, సీఐ అను ముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్లు భద్రు సోదరుడు కురుసం సోమకు అప్పగించారు. వారు ఛత్తీస్ఘడ్ రాష్ర్టం బీజాపూర్ జిల్లా ఇర్సునర్ గ్రామానికి తీసుకెళ్లారు. అదేవిధంగా జమున మృతదేహాన్ని ఆమె చిన్నాన ముష్కి లక్ష్మణ్ కి అప్పగించా రు. కర్ణాకర్, కామేష్ మృతదేహాలను వారి కుటుంబ సభ్యు లకు అప్పగించగా కుటుంబ సభ్యులు ఛత్తీస్ఘడ్ తీసుకెళ్లారు. కిషోర్, జైసింగ్ లకు సంబంధించిన బంధువులు ఎవరూ రాక పోవడంతో వారి మృతదేహాలను మార్చురీ గదిలోనే భద్ర పరిచారు. పెద్దపెల్లికి చెందిన మల్లయ్య అలియాస్ మధు మృతదేహంను ఈనెల 5వతేదీ వరకు రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు ఫ్రీజర్ లో భద్రపరిచారు. మల్లయ్య మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని మృతుని బంధువులు వేసిన పిటీషన్ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసు అధికారులు సైతం చర్యలు తీసుకున్నారు. కాగా, కలెక్టర్ దివాకర చల్పాక ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ చేయాలని ప్రత్యేక అధికారిగా ఆర్డీవోను నియమించడం గమనార్హం.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now