ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం లో నూతనంగా ఓటరు నమోదు ప్రక్రియ అలాగే ఎంఎల్సి ఓటర్ల నమోదు జాబితా తయారీ అంశాలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాఅదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయ లక్ష్మి పరిశీలించారు. బుధవారం కాటారం మండల పరిషత్ కార్యాలయంలో ఓటరు నమోదు ప్రక్రియను అమే పరిశీలిం చారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు తగిన సూచనలు చేశారు. ఓటరు నమోదులో ఏర్పడుతున్న ఇబ్బందులను, పరిస్థితు లను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్లూరి బాబు, మండల పంచా యతీ అధికారి వీరస్వామి తదితరులు ఉన్నారు.