99 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు.

Written by telangana jyothi

Published on:

99 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు.

 – మరో ఇద్దరు ఉపాధ్యాయులు ను నియమించండి మహాప్రబో. 

– విధ్యార్ధుల తల్లిదండ్రుల వినతి. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో 99 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. ఈ పాఠశాలలో నలుగురు టీచర్ లు ఉండాల్సి వుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే భోధన చేస్తున్నారు. దీంతో తమ పిల్లలకు సక్రమంగా విద్య అందటం లేదని, పూర్తిస్థాయి ఉపాధ్యాయు లను, ఖాళీలను భర్తీ చేసి, తమ పిల్లలకు విద్యాబోధన సక్ర మంగా జరిగే విధంగా చూడాలని కోరుతూ, శనివారం విద్యా ర్థుల తల్లిదండ్రులు వాజేడు మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి కార్యాల యంలో అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల తల్లిదం డ్రులు కార్యాలయం ఉద్యోగులకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాల ని, కోరుతూ వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద ,మధ్య తరగతి కుటుంబాల పిల్లలు మాత్రమే చదువు తుంటారని, అలాంటిది ప్రభుత్వం ఉపాధ్యాయు ల ఖాళీలను భర్తీ చేయకుండా తమ పిల్లలకు అరకొర చదువులతో విథ్యా భవిష్యత్ దెబ్బతింటుందని తల్లి దండ్రు లు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్నాధపురం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ దుస్థితి నెలకొన్నది. ములుగు జిల్లా కలెక్టర్, ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి తమ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి, తమ పిల్లలకు పూర్తిస్థాయి విద్య అందే విధంగా చర్యలు తీసుకో వాలని  తల్లిదండ్రులు ముక్త కంఠంతో విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now