వెంకటాపురంలో కొమరం భీమ్ 84 వ వర్ధంతి వేడుకలు
– పాల్గొన్న ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో 84వ కొమరం భీమ్ వర్ధంతిని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ ఆదివాసి మహిళ పేరంటాళ్ళు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆది వాసి గ్రామ పెద్దలు, మహిళ నాయకురాళ్ళు, ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకులు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘణంగా నివాళులు అర్పించారు. అనం తరం ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకులు పూనమ్ రామచందర్రావు, పూనమ్ సాయి, చింత సోమరాజు, పర్శిక సతీష్ లు మాట్లాడుతూ కొమరంభీమ్ వర్ధంతిని పురస్కరిం చుకొని ఆదివాసీల ఆరాధ్య దైవం గోండు బొబ్బిలి పోరాటాల కృషి వల్లనే ఆదివాసులకు భారత రాజ్యాంగంలో ఫిఫ్త్, సిక్స్త్ షెడ్యూల్ భాగంలో పొందుపరచడం జరిగిందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/59, 1/70 పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు చట్టాలను ఉల్లంఘిస్తూ నీరుగారుస్తున్నారని,ఆరోపించారు. అటువంటి ప్రభుత్వాలకు కొమరం భీమ్ లాంటి గెరిల్లా పోరాటాలు జరిపి ఆదివాసులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఉద్యమాల్లోకి ఆదివాసి యువత, మహిళ లు విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే పాలక ప్రభుత్వాలు ఆదివాసులను పెడచెవిన పెట్టి ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆదివా సులకు కేటాయించడంలో దొంగ వైఖరి వ్యవహరిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వారన్నారు. ప్రభుత్వం కూడా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుడే అన్నారు. ఆదివాసి హక్కు ల పైన చట్టాలు పైన, నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వా నికి లేదని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను నిర్వహించుటకు విడుదల చేసిన జీవో నెంబర్ 33, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి చట్టాలకు విరుద్ధమని చట్టం ఉండంగా చట్టానికి వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 33 చెల్లదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని వారన్నారు. అలాగే జనరల్ విధానాన్ని ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఇది సరైన విధానం కాదని, అందుకు ఐ.టీ.డీ.ఏ.పిఓలు, జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో జనరల్ పరిపాలన విధానం వర్తించదని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని వారన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏజెన్సీ ప్రాంతంలో పీసా గ్రామసభల ద్వారా ఎంపిక జరిపి, ఆదివాసులకు న్యాయం చేయాలని అలా లేని పక్షంలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ సమావే శంలో జజ్జరి నారాయణమ్మ గొంది రమాదేవి, ఇరుప లక్ష్మి, ఆలం మల్లికార్జున్, తెల్లం ధనలక్ష్మి, పూనం ఉ షారాణి, సోలం స్వరూప ,తాటి నరసింహారావు, తాటి లక్ష్మణ్, పూనమ్ నాగ రాజు, పూనెం ప్రతాప్, తాటి రాంబాబు, చింత సోమరాజు జజ్జరి సుదర్శన్, పూనమ్ రామచందర్రావు, కనితి వెంకట కృష్ణ,శంకర్, పూనం రమేష్, ఉండం రామచంద్ర ప్రసాద్ ,పూనం పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.