బంధాల అడవుల్లో 4జీ సెల్ సిగ్నల్ ప్రారంభం

బంధాల అడవుల్లో 4జీ సెల్ సిగ్నల్ ప్రారంభం

బంధాల అడవుల్లో 4జీ సెల్ సిగ్నల్ ప్రారంభం

– టవర్ ప్రారంభించిన ఎస్పీ శబరీష్ 

– గిరిజనులకు తీరిన సిగ్నల్ కష్టాలు

ములుగు ప్రతినిధి: ఏజెన్సీలో సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయక గిరిజనులు మైదాన ప్రాంతాల వారితో సంబంధాలు తక్కు వగా ఉండేవి. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ డాకట్ర్ పి.శబరీష్ చొరవతో తాడ్వాయి మండలం బంధాల అడవుల్లో 4జీ సేవ లు మొదలయ్యాయి. ఎయిర్టెల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లా డిన ఎస్పీ టవర్ ఏర్పాటు చేయించగా బుధవారం సెల్ టవర్ ను ఎస్పీ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దశాబ్ధాలుగా సెల్ సిగ్నల్స్ కు నోచుకోని ఆదివాసీ గిరిజనులకు 4జీ సేవలు అందడం సంతోషకర మన్నారు. ఈ టవర్ తో బంధాల, పోచాపూర్, అల్లిగూడెం, గొల్లపల్లి, నర్సాపూర్ తదితర మారుమూల గ్రామాల ప్రజలకు లబ్ది చేకూరు తుందన్నారు. ఏదైనా ఆపద వస్తే 108కు సమాచారం ఇవ్వాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేదని, సెల్ టవర్ ఏర్పాటుతో ఇబ్బందులు తొలగాయని పేర్కొన్నారు. ఇప్పటికే మేడారం నుండి తాడ్వాయి, తాడ్వాయి నుండి పస్రా మధ్య నెట్వర్క్ ను బలోపేతం చేసేదిశగా టవర్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని టవర్లు ఏర్పాటు చేస్తామన్నారు. టవర్ ఏర్పాటుకు కృషిచేసిన డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ రవీందర్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆపరే షన్ మేనేజర్ సుగుణాకర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సదానందం, మేనేజర్ రమేష్బాబు, ప్రదీప్ మోతే, తదితరులు పాల్గొన్నారు